Minister Harish Rao | భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తామనేది ముఖ్యం..రంగులు కాదు : మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao | భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తామనేది ముఖ్యం కానీ, రంగులు ముఖ్యం కాదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడిన రంగురంగుల వినాయకులు పర్యావరణానికి విఘతం కలిగిస్తాయి. అందరూ మట్టి వినాయకులనే పూజించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట : భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తామనేది ముఖ్యం కానీ, రంగులు ముఖ్యం కాదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడిన రంగురంగుల వినాయకులు పర్యావరణానికి విఘతం కలిగిస్తాయి. అందరూ మట్టి వినాయకులనే పూజించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌక్లో అమర్నాథ్ అన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసి మాట్లాడారు.
మంచు కొండలలో దక్షిణ భారతదేశం వారికే కాకుండా ఉత్తర భారతదేశం వారికి కూడా ఉచితంగా అన్నదానం చేస్తూ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. సమితి సేవలను గుర్తించి అయోధ్య రామాలయ నిర్మాణ ట్రస్ట్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్నదానం చేసేందుకు సంస్థకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఇది మన అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
అమర్నాథ్ అన్నదాన సేవా సమితి భవన నిర్మాణానికి స్థలం సేకరించడం పూర్తయింది. త్వరలోనే భవన నిర్మాణాన్ని ప్రారంభించుకుందాం. ఈనెల 3, అక్టోబర్ ఒకటి, రెండు తేదీలలో చాగంటి కోటేశ్వరరావు సిద్దిపేటలో ప్రవచనాలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, నిత్య అన్నదాన సమితి సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

