యునిసెఫ్ గుర్తింపు.. తెలంగాణకే గర్వకారణం : మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించడం తెలంగాణకే గర్వకారణంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
హైదరాబాద్ : మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించడం తెలంగాణకే గర్వకారణంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అందుకు ఇది ఒక నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ సర్కార్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్లో ఇవాళ ఓ పోస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ఏరియా ఆస్పత్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు ఫోటోను యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్ పోస్టులో జత చేసింది.
తెలంగాణలో మాతాశిశు సంరక్షణ భేష్‌గా ఉందని యునిసెఫ్ పేర్కొన్నది. మిడ్ వైఫరీలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచినట్లు యునిసెఫ్ తన ట్వీట్లో వెల్లడించింది. మెటర్నిటీ కేర్ అంశంలో తెలంగాణ సర్కార్ గౌరవప్రదమైన రీతిలో పనిచేస్తున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. పురుడు సమయంలో తల్లులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ కలిగే రీతిలో మిడ్‌వైవ్స్‌కు శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశ్నించింది. ఫర్ ఎవర్నీ చైల్డ్, ఎ హెల్తీ స్టార్ట్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను యునిసెఫ్ పోస్టు చేసింది.
Proud moment for #Telangana as global organizations recognise the efforts of our government towards maternity care. This is the endorsement of thriving #AarogyaTelangana under the dynamic leadership of #CMKCR garu. https://t.co/WWWdPzZFDk
— Harish Rao Thanneeru (@trsharish) December 30, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

