కరీంనగర్ : భారత రాజ్యాంగ 73వ దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు నాయకులు కరీంనగర్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన అప్రోచ్ పనులను పరిశీలించారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కలెక్టర్ ఆర్వి కర్ణన్, తదితరులు పాల్గొన్నారు.