హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యం లో తరుగు పేరుతో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, ఆ మిల్లర్లపై చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. మిల్లు వద్దకు వచ్చిన లారీలను అన్లోడ్ చేయకుండా నిలిపేస్తే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. గు రువారం ఆయన సచివాలయంలో మిల్లర్ల అ సోసియేషన్ ప్రతినిధులతో యాసంగి ధాన్యం సేకరణ, సీఎమ్మార్ నూక శాతం తదితర సమస్యలపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగకూడదని, ధాన్యం అన్లోడింగ్ వెంటవెంటనే చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సీఎమ్మార్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసంగి ధాన్యంలో నూక శాతంపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. దీనిపై నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను ప్రస్తుత సీజన్‌కు ఏవిధంగా అన్వయించాలో పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
మిల్లర్లు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. యాసంగి సీజన్లో రా రైస్ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో యాసంగి సీజన్లో అధిక ఉష్ణోగ్రతలకు పొట్ట దశలోనే గింజ విరిగిపోతుందని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం యాసంగిలో ముడిబియ్యాన్ని ఇవ్వాలనడంతో రైతులతోపాటు మిల్లింగ్ ఇండస్ట్రీ అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు వివరించారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేం ద్రానికి విజ్ణప్తి చేశారు. వ్యవసాయం, రైతు సంక్షేమంలో తాము కూడా భాగస్వాములమేనని, తమను రైతులకు శతృవులుగా ప్రచారం చేయడం బాధకలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎఫ్ఏక్యూతో ఉ న్న ధాన్యంలో కోతలు పెట్టడం లేదని చె ప్పారు. ప్రస్తుత యాసంగిలో అకాల వర్షా ల కారణంగా ధాన్యం ముకడంతోపాటు రంగుమారుతున్నదని పేర్కొన్నారు. దీనికి తోడు ముడిబియ్యంగా మార్చడం వల్ల సగానికి పైగా నూకలే వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన నూక శాతన్ని తేల్చాలని విజ్ణప్తి చేశారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, జీఎం శ్రీనివాసరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీ ఏ సుధాకర్‌రావు, వరింగ్ ప్రెసిడెంట్ బీ ప్రభాకర్‌రావు, ట్రెజరర్ చంద్రపాల్, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.