అదిరేది లేదు.. బెదిరేది లేదు
కేంద్రంలోని మోదీ సరార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
- తెలంగాణ ఆడబిడ్డ జోలికొస్తే తెగువ చూపుతం
- ఈడీ నోటీసుపై మంత్రి గంగుల
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సరార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీచేయడాన్ని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
బేటీ బచావ్, బేటీ పడావ్ అంటే ఇదేనా.. మోదీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. మహిళల తరపున పనిచేస్తున్న కవితను వేధించడం సబబేనా అని ప్రశ్నించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వంపై రాజకీయ కుట్రతో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం నీచమని మండిపడ్డారు. నిరంకుశ చర్యలు మానుకోకపోతే తెలంగాణ సమాజం తన తెగువేంటో చాటిచెబుతుందని హెచ్చరించారు. ఈ ఉడుత బెదిరింపులకు తెలంగాణ భయపడదని, కడిగిన ముత్యంలా బయటకొస్తుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

