నమస్తే తెలంగాణ నెట్వర్క్: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సబ్బండవర్ణాల మద్దతు పెరుగుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. శనివారం వివిధ కులసంఘాలు, పార్టీల నాయకులు టీఆర్ఎస్కు జైకొట్టారు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని, గెల్లు శ్రీనును గెలిపించుకుంటామని స్పష్టంచేశారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో పోతిరెడ్డిపేటకు చెందిన లింగబలిజ కులస్థులు మంత్రి హరీశ్‌రావును కలిసి, గెల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. జమ్మికుంటలో మండల ఎలక్ట్రీషన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మంది ఎలక్ట్రీషియన్స్, వ్యవసాయ మార్కెట్లో పనిచేసే 200 మంది చాటావళి, గుండ్లపోత మహిళా కార్మికులు మంత్రి కొప్పుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్‌కు చెందిన 100 మంది యువకులు మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో గులాబీగూటికి చేరారు. జమ్మికుంట మండలం వావిలాలలో టీఆర్ఎస్ నాయకుడు గొర్ల సతీశ్‌యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ యువ నాయకులు కొండ అర్జున్, కొండా హరీశ్ సుమారు 50 మందితో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరా రు. కమలాపూర్ మండలం అంబాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. గెల్లు శ్రీనివాస్‌కు వర్సిటీ టీచర్స్ అసొసియేషన్ కాంట్రాక్ట్ తెలంగాణ స్టేట్ (ఉథాట్స్) మద్దతును తెలిపింది.