కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)పేర్కొన్నారు. నగరంలోని 14, 59 వ డివిజన్ లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు.
రానున్న రోజుల్లో కరీంనగర్(Karimnagar) నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేస్తున్నానని గుర్తు చేశారు. తనపై ఎంతో నమ్మకంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని ప్రజలు శభాష్ అనే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. నగరంలో సీఎం కేసీఆర్(CMKCR) సహకారంతో నగర రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
కేబుల్ బ్రిడ్జి(Cable Bridge) నిర్మాణం పూర్తయిందని. మానేరు రివర్ ప్రంట్ పూర్తయితే కరీంనగర్ పర్యాటకంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. వచ్చే నెలలో టీటీడీ సహకారంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణపనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, గందే మాధవి మహేశ్ , బోనాల శ్రీకాంత్ రాజేందర్ రావు , ఐలందర్, యాదవ్ రెడ్డి, సంక్షేమ సంఘం శ్రీనగర్ సప్తగిరి కాలనీ అధ్యక్షుడు చెన్నాడి రాజేశ్వర్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, గడ్డం జగత్ పాల్ రెడ్డి, గడ్డం ప్రశాంత్ రెడ్డి, కోట భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.