Minister KTR | నూతన సచివాలయంలో లక్ష డబుల్ ఇండ్ల ఫైలుపై మంత్రి కేటీఆర్ తొలి సంతకం
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్నారు.
Minister KTR | హైదరాబాద్/ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్నారు. హైదరాబాద్‌లో లక్ష మం ది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం గా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి మంత్రి కేటీఆర్ ఆదివారం అడుగు పెట్టనున్నారు. మూడో అంతస్తులోని తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలకమైన ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు.
రేపు వ్యవసాయ సమీక్
నూతన సచివాలయంలో వ్యవసాయశాఖపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు 16 అంశాలతో ఎజెండాను రూపొందించి, వివిధ విభాగాల హెచ్వోడీలకు సమాచారం అందజేశారు. 2023-24 వానకాలం సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు వేదికల్లో సమావేశాల నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ యాక్షన్ ప్లాన్, యాసంగి మక్కల కొనుగోళ్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల పనితీరు తదితర అంశాలను ఎజెండాలో చేర్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

