హైదరాబాద్, మే14( నమస్తే తెలంగాణ) : బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతువిప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో త రచూ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నారని ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీనటరాజన్కు ఓ వర్గం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గతంలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి చేసి న వ్యాఖ్యలను, తాజాగా కుల సంఘాల ప్రస్తావన తీసుకొస్తూ బాలిక విషయంలో చేసిన వ్యాఖ్యలనూ ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. తరచూ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసేలా మాట్లాడుతున్నట్టు ఆ మెకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మీడి యా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మీనాక్షి సదరు మం త్రికి సూచించినట్టు తెలుస్తున్నది.
భగీరథ్‌పై పోక్సో కేసు విషయంలో స దరు మంత్రి ఇటీవల మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యా యి. ఆ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, కులపెద్దలు కలిసి కూర్చొ ని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. ‘పెండ్లి చేస్తారో? లేక పంచాయితీ ద్వారా తేల్చుకుంటారో? అది మీ ఇష్టం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన చోట రాజీ ప్రస్తావన తేవడం, బా లికకు పెండ్లి సూచనలు చేయడం మహి ళా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేశా యి. మరోవైపు సదరు మంత్రి వ్యాఖ్యలను మున్నూరుకాపు సామాజిక వర్గం నే తలు తప్పుబట్టారు. సామాజిక వర్గాన్ని కించపరిచేలా మంత్రి మాట్లాడారని వా రు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆయ న వైరివర్గాలు ఈ వివాదాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షీనటరాజన్, ఇతర ము ఖ్యనేతలకు చేరవేసినట్టు తెలిసింది.
తనపై పనిగట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారని గుర్తించిన ఆ మంత్రి దిద్దుబాటు చర్యలకు దిగారు. వెంటనే మీడియా స మావేశం పెట్టి వివరణ ఇచ్చారు. కొందరు పనిగట్టుకుని వక్రీకరించారని, బాధితురాలికి న్యాయం జరుగాలనే అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు. బాధితురాలి పక్షాన ఉండాల్సిన కులపెద్దలు ఒక వర్గానికి మ ద్దతివ్వడంపైనే తాను ప్రశ్నించానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మంత్రి వ్యవహారంపై మహేశ్మార్గౌడ్ మాట్లాడుతూ..‘పోక్సో కేసు వంటి సున్నితమైన అంశాల్లో సామాజిక, రాజీ, కులాల ప్రస్తావన తేవడం చట్టపరంగా, నైతికంగా అంగీకారయోగ్యం కాదు’ అని ప్రకటించారు. అవి ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పడంతో సదరు మంత్రికి మరింత డ్యా మేజ్ అయింది. గతం లో సదరు మంత్రి వ్యాఖ్యలతో సహచర మంత్రి లక్ష్మణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేశారు. చివరకు ఆ మంత్రి క్ష మాపణలతో ఆ వివాదం సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు ఆ మంత్రి మరో వివాదంలో చిక్కుకోవడం, దాన్ని వైరివర్గాలు అడ్వాంటేజ్‌గా తీసుకోవడంతో మరింత వివాదాస్పదమైంది.