యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. స్వామ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా పీడన తొలగి పోవాలని తెలంగా ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నాని తెలిపారు.