జనగామ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ధూప దీప నైవేద్య సంఘం అర్చకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు అర్చకులు మంత్రి ఎర్రబెల్లిని ఘనంగా సత్కరించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్లో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇప్పటివరకు బ్రాహ్మణుల సంక్షేమం కోసం వివిధ పథకాల కింద ప్రభుత్వం రూ.232 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. నాడు 8 వందల 5 ఆల కేవలం 2వేల 500 రూపాయలు ఇచ్చేవారు.నేడు ధూప, దీప, నైవేధ్య పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల 541 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సీఎం కేసీఆర్ వేతనాలను 6వేల కు పెంచి, ఆ తర్వాత 10 వేలకు పెంచారని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరబాద్ లో 10ఎకరాల స్థలంలో బ్రాహ్మణ సదనం నిర్మించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయ భూములు నిరక్ష్యానికి గురయ్యాయి. అన్యాక్రాంతమైన ఇప్పటి వరకు 6 వేల ఎకరాల దేవాలయ భూములను కాపాడి, వాటి ద్వారా ఆదాయం వచ్చే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ లు, భవనాలు, కల్యాణ మండపాలను, పెట్రోల్ బంకులు నిర్మించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేస్తున్నామని చెప్పారు.
గతంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలతో పాటు మన కవులు, కళాకారులకు తెలంగాణ వచ్చాకే తగిన గౌరవం, గుర్తింపు దక్కింది. కనీవినీ ఎరుగతి రీతిలో దేవాలయాల అభివృద్ధి జరుగుతుంది. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, సీఎంగా కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందన్నారు. అందరి సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడో సారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి