మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లలను అందజేస్తూ ముదిరాజ్ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా నీలి విప్లవం తీసుకొచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలో సబ్సిడీపై అందజేసిన చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ముదిరాజ్లు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముదిరాజ్ల కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజా సేవకు పాటుపడుతున్న సీఎం కేసీఆర్ని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.