మహబూబాబాద్ : ప్రతి విద్యార్థి చదువు ప్రాధాన్యాన్ని తెలుసుకున్నప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు.
మంగళవారం మహబూబాబాద్(Mahaboobabad)లోని వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ప్రత్యేక అధ్యయన శిబిరం ముగింపు, పాదపూజ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు.
తల్లిదండ్రులు(Parents) పిల్లల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. లక్ష్యం వైపు ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు మార్గదర్శం కావాలని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో మార్కులు కొలమానం కాదని, మార్పు అవసరమని వెల్లడించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల(Government Schools)ను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. మన ఊరు – మనబడి(Mana Uru – Manabadi) కార్యక్రమం కింద రూ. 7 వేల కోట్ల తో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
విద్యార్థులను సెల్ఫొన్, టీవీ మాధ్యమాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రైవేటుకు ధీటుగా విద్యాభ్యాసం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ పింకేష్ కుమార్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రేవలేషన్ చైర్మన్ లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్, డీఈవో రామారావు, ఆర్డీవో ఎల్ రమేశ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.