హనుమకొండ : అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం కటక్షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 60 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి, ఎమ్మెల్యేను లబ్ధిదారులైన మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్వరలోనే సొంత స్థలాలు ఉన్నవాళ్లకు కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.