Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ స్ఫూర్తితో పాలకుర్తి నియోజకవర్గంలో దేవాలయాలకు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామివారి దర్శించుకొని.. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్నిరంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నానన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తాను తన పాలకుర్తి నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మంత్రికి, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు మంత్రికి, స్వామి వారి పట్టు వస్త్రాలతో, తీర్థ ప్రసాదాలతో ఆశీర్వచనం అందజేశారు.