హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన తెలంగాణ చరిత్రలో కలకాలం నిలిచిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao ) పేర్కొన్నారు. ఇప్పటికే 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా, తాజాగా మరో 80 వేల పైచిలుకు భర్తీ చేయాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 8 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని, వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఖాళీగా భర్తీకి బీజేపీ నేతలు ధర్నా చేయాలన్నారు.