హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆలిండియా ట్రేడ్ యూనియన్లు గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్టు యూసీసీఆర్ఐ-ఎంఎల్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను రూపొందిస్తున్నారని ఆరోపించింది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో కూలీలు, కార్మికులు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విధానాలను వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.