ఫడ్నవీస్‌ను పీఎం రేసు నుంచి తప్పించేందుకే!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను భవిష్యత్‌లో ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా ఎదగకుండా చేసేందుకే కేంద్ర హోంమత్రి అమిత్ షా ‘అపరేషన్ టైగర్'కు తెరలేపారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు.
- ఆపరేషన్ టైగర్‌కు తెరలేపిన అమిత్ షా: ఉద్ధవ్ ఠాక్రే
హింగోలి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను భవిష్యత్‌లో ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా ఎదగకుండా చేసేందుకే కేంద్ర హోంమత్రి అమిత్ షా ‘అపరేషన్ టైగర్’కు తెరలేపారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. మహారాష్ట్రలోని హింగోలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇది ‘ఆపరేషన్ టైగర్’ కాదని, ‘ఆపరేషన్ దేవేంద్ర’ అని వ్యాఖ్యానించారు. తిరుగుబాటు చేసిన శివసేన ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో ఎందుకు చేరారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్‌లో అవసరమైతే ఈ తిరుగుబాటు ఎంపీలు అమిత్‌షాకు ప్రధానమంత్రి పదవి కోసం ఓటు వేస్తారు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు, పరీక్షా పత్రాల లీకేజీల వంటి ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రేకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఎంపీలు పార్టీని వీడినా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారన్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో శివసేన(యూబీటీ) తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. వారిలో ఆరుగురు తాజాగా షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో లోక్‌సభలో షిండే వర్గం బలం ఏడు నుంచి 13కు పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

