చిట్యాల, ఫిబ్రవరి 11 : కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని, అడ్డుకోవాలని ఫి ర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులతో కట్టంగూరు ఎస్సై దురుసుగా వ్యవహరించారు. దీం తో చిట్యాల 1వ వార్డులో కొద్ది సేపు ఉద్రిక్తతనెలకొన్నది. బుధవారం చిట్యాల ఒకటో వార్డు లో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ నా యకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నే పథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో అకడ ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశా రు.
డబ్బులు పంచుతున్న విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు పోలీసుల దృష్టి కి తీసుకెళ్లి, వారిపై చర్యలు తీసుకొని, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టాలని డి మాండ్ చేశారు. దీంతో పోలీలసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అకడే విధి నిర్వహణలో ఉన్న ఎస్సై రవీందర్ బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగి..వాళ్లు రూ. 4000 పంచితే మీకు చేతనైతే రూ. 5000 పంచుకోండి.. అనడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహంతో ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.