Brett Lee | ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్లపై స్పందించిన మాజీ క్రికెటర్ బ్రెట్లీ.. అసలు నిజం అదే!
Brett Lee | బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta)తో తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ (Brett Lee) ఎట్టకేలకు స్పందించారు. తామిద్దరం ఎప్పుడూ డేటింగ్ చేయలేదని, కేవలం మంచి స్నేహితులుగా మాత్రమే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
Brett Lee | బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta)తో తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ (Brett Lee) ఎట్టకేలకు స్పందించారు. తామిద్దరం ఎప్పుడూ డేటింగ్ చేయలేదని, కేవలం మంచి స్నేహితులుగా మాత్రమే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్లో ప్రీతి జింటాకు చెందిన పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్టు తరఫున బ్రెట్లీ ఆడిన కాలంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈ రూమర్లపై బ్రెట్ లీ ఓపెన్ అవుతూ పుకార్లకు చెక్ పెట్టారు.
ఇటీవల ఒక మీడియాతో మాట్లాడిన బ్రెట్లీ.. ప్రీతి జింటా అత్యంత తెలివైన మహిళ అని, ఆమెపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఇలాంటి నిరాధారమైన కథనాలు ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని, ఎందుకంటే తనకు నిజమేంటో తెలుసని అన్నారు. ప్రజలు ఏవైనా ఊహించుకోవచ్చని, కానీ ఆ పుకార్లను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. 2008 నుంచి 2011 మధ్య కాలంలో పంజాబ్ జట్టు తరఫున లీ ఆడుతున్న సమయంలో ముంబైలోని ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్లు మరింత బలపడ్డాయి. అయితే 2010లోనే ప్రీతి జింటా స్పందిస్తూ బ్రెట్ లీతో తనను రొమాంటిక్గా ముడిపెట్టడం పాతబడిపోయిందని, తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, బ్రెట్లీ 2014లో లానా అండర్సన్ను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే ప్రీతి జింటా 2016లో జీన్ గుడ్ఇనఫ్ను వివాహం చేసుకోగా, 2021లో సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రీతి జింటా త్వరలో ‘బట్వారా 1947’ (Batwara 1947) చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

