Ben Stokes | యాషెస్ సిరీస్ ఆడను.. కానీ, ఇంగ్లండ్ జట్టుకు కోచింగ్ ఇవ్వాలనుంది..!
Ben Stokes : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బెన్ స్టోక్స్(Ben Stokes) యూటర్న్ గురించి వస్తున్న వార్తలను ఖండించాడు.
Ben Stokes : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బెన్ స్టోక్స్(Ben Stokes) యూటర్న్ గురించి వస్తున్న వార్తలను ఖండించాడు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ ఆడే అవకాశాలున్నాయని ఈసీబీ ఎండీ రాబ్ కీ పేర్కొనడం అంతా ఉత్తిదే అని స్టోక్స్ తేల్చేశాడు. తనకు యాషెస్ ఆడాలనే ఉద్దేశం లేదని, కాకపోతే ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలందించాలని ఉందని 35 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ తన మనసులోని మాటను వెల్లడించాడు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన బెన్ స్టోక్స్ కోచ్‌గా అవతారమెత్తాలని అనుకుంటున్నాడు. టెస్టు క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే అతడు.. తిరిగి కోచ్‌గా ఇంగ్లండ్ జట్టుకు మెలకులు నేర్పాలని ఆరాటపడుతున్నాడు. ఈ విషయాన్ని స్టోక్సే స్వయంగా చెప్పాడు.
Ben Stokes Breaks Silence on His Relationship With Rob Key
🗣️
” I think initially, with the incident, we were in contact every one or two days. Then obviously I got back into the team and started playing again, and then it just sort of… you know, it is how it is. And now,… pic.twitter.com/fFJPJtPsU0— OldMonkofCricket (@OldMonkOfCric) August 4, 2026
‘నేను లెవల్ త్రీ కోచింగ్‌లో ఉన్నా. ప్రస్తుతం నేను దేశవాళీలో ఆడుతున్నా. పూర్తిగా ఆట మానేశాక నేను కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నా. రిటైరైనా.. క్రికెట్‌తో ఎలా కొనసాగాలో నాకు తెలుసు. ఏదో ఒకరోజు ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేయడాన్ని నేను ఇష్టపడతాను. ఆటను వదిలేశాక.. నా మనసులో తట్టిన ఆలోచన అదే’ అని స్టోక్స్ వివరించాడు. లార్డ్స్ టెస్టులో ఓటమి అనంతరం స్టోక్స్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
🚨WANT TO BE COACH OF ENGLAND CRICKET TEAM – BEN STOKES🤯
Ben Stokes said :🗣️
“I want to be a coach. I know what I want to do interms of staying within the game which is to be a coach and would I love to be coach of England cricket team one day. I would love to be able to do… pic.twitter.com/WwDpO7UK03
— Akshat (@Cricketmythos) August 4, 2026
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌ను ‘స్టోక్స్‌కు ముందు.. స్టోక్స్ తర్వాత’ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. సంప్రదాయ క్రికెట్‌నే నమ్ముకున్న జట్టుకు దూకుడు నేర్పిన కెప్టెన్లలో స్టోక్స్ పేరు ముందు వరసులో ఉంటుంది. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే.. వికెట్లు పడుతున్నా సరే.. దంచుడే పరమావధిగా ఆడడం అతడి నైజం.
జో రూట్ వారసుడిగా 2022లో టెస్టు పగ్గాలు అందుకున్న స్టోక్స్.. బజ్‌బాల్ ఆటను పరిచయం చేశాడు.
బ్రెండన్ మెక్కల్లమ్ హెడ్‌కోచ్‌గా, దూకుడే మంత్రగా ఆడే స్టోక్స్ సారథ్యంలో.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ వన్డే తరహాలో ఆడడం అలవర్చుకుంది ఇంగ్లండ్. అయితే.. యాషెస్ సిరీస్‌లో పరాజయం, ఆపై స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 1-2తో సిరీస్ ఓటమితో విమర్శలపాలయ్యాడు స్టోక్స్. ఇక టైమ్ వచ్చేసింది అనుకున్నాడేమో లార్డ్స్ టెస్టు మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడీ వెటరన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

