కోదాడ, ఆగస్టు 04 : సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పద్మనాభరెడ్డి అని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో పద్మనాభ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా కోదాడ ఐఏఎల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మనాభరెడ్డి న్యాయవాదిగా 50 వేలకు పైగా క్రిమినల్ కేసుల్లో పేదల తరఫున నిలబడి న్యాయం చేకూర్చారని గుర్తు చేశారు. ఐఏఎల్ వ్యవస్థాపక నాయకుడిగా సంఘ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గట్ల నరసింహ రావు, సీనియర్ న్యాయవాది సాధు శరత్ బాబు, ఐఏఎల్ కోదాడ శాఖ కార్యదర్శి వెంకటాచలం, న్యాయవాదులు మహ్మద్ రియాజ్, సామ నవీన్ కుమార్, కంచర్ల శరత్ కుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, దుగ్గి వెంకటేశ్, రవీందర్ పాల్గొన్నారు.