సమ్మెకు సీపీఐ మద్దతు : కూనంనేని
కేంద్ర కార్మిక సంఘాలు చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ర్యాలీలు, ప్రదర్శనల్లో సీపీఐ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : కేంద్ర కార్మిక సంఘాలు చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ర్యాలీలు, ప్రదర్శనల్లో సీపీఐ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటిస్థానంలో కార్పొరేట్‌కు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లలను కేంద్రం తీసుకొచ్చిందని మండిపడ్డారు.
గతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తాజాగా కేంద్రం అమెరికాతోవాణిజ్య ఒప్పందం చేసుకొని, రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో ప్రభుత్వ రంగసంస్థలు మొత్తం ప్రైవేట్‌పరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు, కర్షకులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని కూనంనేని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

