హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. ప్రకృతి ఒడిలో పూచే పువ్వుల పండుగ
అని, పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ (Bathukamma) అని చెప్పారు. ప్రభుత్వమే ప్రజల పండుగలను నిర్వహించే గొప్ప సంస్కృతిని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించి కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమైన పండుగలకు ప్రజలకు కానుకలు ఇచ్చి పండుగలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో జరుపుకునే ఈ గొప్ప పండుగ సందర్భంగా తెలంగాణ (Telangana) ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.