Valcono Erruption | ఇండోనేషియాలో 25 గంటలపాటు లావా విరజిమ్మిన అగ్నిపర్వతం.. Video
Valcono Erruption | ఇండోనేషియా (Indonasia) లోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా (Anak Krakatau) అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. సుమారు 25 గంటలపాటు నిరంతరాయంగా లావా, బూడిద వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విస్ఫోటనం కారణంగా ఆకాశమంతా దట్టమైన బూడిద మేఘాలు అలుముకోవడంతో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి.
Valcono Erruption : ఇండోనేషియా (Indonasia) లోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా (Anak Krakatau) అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. సుమారు 25 గంటలపాటు నిరంతరాయంగా లావా, బూడిద వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విస్ఫోటనం కారణంగా ఆకాశమంతా దట్టమైన బూడిద మేఘాలు అలుముకోవడంతో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ అగ్నిపర్వతం 24 గంటలపాటు ఏకధాటిగా లావాను వెలిగక్కింది. ఈ విస్ఫోటానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి.
ఆకాశంలో దట్టమైన బూడిద వ్యాపించడంతో ముందుజాగ్రత్త చర్యగా జకార్తాలోని సోకర్నో-హట్టా, హలిమ్ పెర్దనకుసుమ అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 8 ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో సుమారు 2,300 విమాన సర్వీసులు రద్దు లేదా దారి మళ్లించారు. దీనివల్ల దాదాపు 2.70 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ లెవెల్-3 (హై అలర్ట్) హెచ్చరికను జారీచేసింది. స్థానికంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విస్ఫోటనం వల్ల సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2018లో ఇదే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు సంభవించిన సునామీ కారణంగా సుమారు 430 మంది మరణించారు. ప్రస్తుతానికి బూడిద, విష వాయువులు, వేడి రాళ్ల ముప్పు మాత్రమే ఉందని తెలిపారు. పరిస్థితి వేగంగా మారుతున్నందున విమానాశ్రయాల పునఃప్రారంభంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని రవాణాశాఖ మంత్రి దుదీ పుర్వగంధీ పేర్కొన్నారు.
🌋✈️🌏 Imagenes impresionantes del volcán Anak Krakatoa, situado en el estrecho de Sonda en Indonesia, completó 25 horas de erupción continua con columnas de ceniza de hasta 15.000 metros de altura. Se han cancelado 2.300 vuelos en 7 aeropuertos con 270.000 pasajeros afectados. pic.twitter.com/JAW2uZTFrc
— Cesar Augusto Londoño (@cesaralo) September 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

