జనగాం : అకాల వర్షాలతో నష్టపోయిన పంటల(Crop Damage) వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే పంపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అధికారులను ఆదేశించారు. శనివారం జనగాం జిల్లా(Janagam District) కలెక్టరేట్లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్ష(Review) నిర్వహించారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం(Compensations) అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతులు పండించిన యాసంగి పంటలను ప్రభుత్వం పరంగా ఆఖరు గింజ వరకు కొనుగోలు చేయాలని సూచించారు.మక్కలను కొనుగోలు(Maize Centres) చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
సీఎం కేసీఆర్( CM KCR) నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ జడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.