హైదరాబాద్ : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండిలో సీటు సాధించిన మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండల చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు నాగన్న, మహేశ్వరి దంపతుల కూతురు ధర్మారపు వాణిశ్రీని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించారు.
భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్న ఊరు, కన్నతల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని ఆకాక్షించారు. అలాగే వీరి పెద్దమ్మాయి స్పందన కూడా లాస్ట్ ఇయర్ మెడిసిన్లో సీటు సాధించి ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న విషయం తెలుసుకొని ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నందుకు తల్లిదండ్రులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.