వరంగల్ : మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావు కుమారుడు తెలంగాణ జన వేదిక అధ్యక్షుడు రాము ఆకస్మిక మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. రాము భౌతికఖాయం వద్ద పుష్ప గుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావు కుటుంబ సభ్యులను కలిసి రాము మరణానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాము ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.