Minister Dayakar Rao | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వరంగల్‌లో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులను ఆదేశించారు.
మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలకు తరలించి వసతి సౌకర్యం, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ముంపు ప్రభావిత ప్రాంతాలపై మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా పర్యటించి పరిస్థితి సమీక్షించారు.
చిన్న వడ్డేపల్లి చెరువు, గరీబ్‌నగర్, మధురానగర్, ఎస్ఆర్నగర్, నాగేంద్ర నగర్, కీర్తి బార్ ఏరియా, డీకేనగర్, శాంతి నగర్, బొందివాగు నాలా, మైసయ్య నగర్, ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తూర్పాటి సులోచన సారయ్య, గుండేటి నరేందర్ కుమార్, ఓని స్వర్ణలత భాస్కర్, పోశాల పద్మ స్వామి, సిద్ధం రాజు, సోమిశెట్టి ప్రవీణ్ మరుపల్ల రవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.