సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara) అన్నారు. శుక్రవారం అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17,18వ వార్డులలో ప్రజా పాలన(Prajapalana) అభయహస్తం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందోల్ నియోజకవర్గ ప్రజలు నాకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. అందోల్ను అభివృద్ధి దశలో ముందంజలో ఉంచేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు.