హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ):హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపొద్దని, అది చట్టరీత్యా నేరమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించిన మానవహారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెచ్ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ఏఆర్టీ సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తున్నట్టు వివరించారు. అనంతరం చంచల్గూడ జైలులో ఏర్పాటు చేసిన మూడ్రోజుల మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత కొండాపూర్లో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.