NCD Survey | హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 30 ఏండ్లు దాటినవారిలో దాదాపు 23 లక్షల మందికి బీపీ, 12 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎన్సీడీ క్లినిక్లలో అందుతున్న సేవలపై వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ఎన్సీడీ సర్వే నివేదికను మంత్రికి అందజేశారు. 30 ఏండ్లు దాటిన 1.66 కోట్ల మందిని స్రీనింగ్ చేయగా, అందులో 22.94 లక్షల మందికి బీపీ, 11.9 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు తెలిపారు. రోగులకు ఉచితంగా మందులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులందరూ క్రమం తప్పకుండా మందు లు వాడేలా చూడాలని తెలిపారు. ప్ర భుత్వ దవాఖాన్లలో వసతులు, మం దులు, డాక్టర్లు, సిబ్బంది హాజరు, తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆ ర్వీ కర్ణన్, తదితరులు పాల్గొన్నారు.