జోగులాంబ గద్వాల : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు.
వారి వెంట గద్వాల, అలంపూర్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఏఎన్సీ మురళీధర్ రావు ఉన్నారు. కాగా, ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వారు చిన్నోనిపల్లి గ్రామానికి చేరుకున్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనుల పురోగతిపై వారు సమీక్షించనున్నారు.