ఖమ్మం : ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ సిమ్యులేటర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విధానం డ్రైవింగ్ శిక్షణ పొందడానికి చాలా సులభమైన పద్ధతని, సాంకేతికతను ఉపయోగిస్తూ డ్రైవింగ్‌ను తేలిగ్గా నేర్చుకోవచ్చన్నారు.
కార్లు, ట్రక్కులు, బస్సులు మొదలైన వాహనాలు భయాందోళన లేకుండా, ప్రమాదం లేకుండా నేర్చుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనుభవం లేని డ్రైవర్ శిక్షణను సిమ్యులేటర్ ద్వారా విజయవంతంగా పూర్తి చేయొచ్చన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు పాలకుర్తి క్రిష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ పాకాలపాటి విజయ, నాయకులు మజీద్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.