కొత్తపల్లి, ఆగస్టు 11 : ‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వడ్డించాల ని ఉత్తర్వులు విడుదల చేస్తే ఇక్కడేంటి దొడ్డుబియ్యంతో వడ్డిస్తున్నారు. సన్నబియ్యం ఏ మయ్యాయి..? ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవట్లేదా?’ అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులపై మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ శివారులోని చింతకుం ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠా లు బోధిస్తున్న తీరు, మెస్, వంటగది, కూరగాయలు, నిత్యావసరాలు భద్రపరుచు గదితోపాటు వండిన వంటలను పరిశీలించారు. సన్నబియ్యం భోజనం అందించాల్సి ఉండ గా ఇదేంటి దొడ్డు బియ్యం భోజనం వడ్డిస్తున్నారు? అంటూ అధికారులను ప్రశ్నించా రు. పౌరసరఫరాల శాఖ నుంచి హాస్టల్‌కు దొడ్డుబియ్యం సరఫరా అవుతున్నాయని నిర్వాహకులు చెప్పగానే అధికారులకు ఫోన్‌చేసి దొడ్డు బియ్యం వెనక్కి తీసుకొని సన్నబియ్యం అందించాలని ఆదేశించారు.