హైదరాబాద్: సహచర మంత్రిని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ (Congress) పార్టీలో దుమారం రేపుతున్నాయి. మినిస్టర్లు పొన్నం, వివేక్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని, ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించారు. తాను పక్కనే కూర్చుంటే లేచి వెళ్లిపోవడమేంటని, సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్‌ను నిలదీశారు. మాదగిలు అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. అంతటితో ఆగని మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేను కలుస్తానని స్పష్టం చేశారు. రేపటిలోగా పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వివాదం ముదురుతుండటంతో పీసీసీ రంగంలోకి దిగింది. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌తో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. అదేవిధంగా ఇరురు మంత్రులతో సమావేశం కావాలని పీసీస నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని సమాచారం అందించింది. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబుకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫోన్ చేశారు. ఇద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్‌పై (G.Vivek) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని, ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించారు. తాను పక్కనే కూర్చుంటే లేచి వెళ్లిపోవడమేంటని, సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్‌ను నిలదీశారు. మాదగిలు అంటే అంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి వీడియోను విడదల చేశారు.
‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.