Telangana Assembly | హైదరాబాద్ : శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇవ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎజెండా ఒకటి ఇస్తున్నారు, సభలో మరొకదానిపై చర్చ నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సభలో ప్రస్తావించారు.
ఒక్క పొలిటికల్ పార్టీ కోరికల మీద, ఇష్టం మీద అసెంబ్లీ నడవకూడదు.. అందరిని పరిగణలోకి తీసుకోవాలి అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి సూచించారు. ప్రతి రోజు మాకు ఎజెండా ఒంటి గంటకు వస్తుంది.. మొన్న మాత్రం 1:40 గంటలకు వచ్చింది. అప్పుడు వస్తే సబ్జెక్ట్ మీద మేం ఎప్పుడు ప్రిపేర్ కావాలి. 25 ఏండ్ల నా అనుభవంలో ఇలా సభ జరగడం నేను ఎప్పుడు చూడలేదు అని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
శాసనసభ ఎజెండాపై అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సమర్థించారు. ఎజెండా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. శాసనసభ ఎజెండాపై మిత్రపక్షంగా మీరు కూడా స్పందించకపోతే ఎలా అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. మీకు ఎజెండా అయిన వస్తుంది.. మాకు అది కూడా రావడం లేదంటూ అక్బరుద్దీన్ ఓవైసీతో కూనంనేని సాంబశివరావు అన్నారు.
ఒక్క పొలిటికల్ పార్టీ కోరికల మీద, ఇష్టం మీద అసెంబ్లీ నడవకూడదు.. అందరిని పరిగణలోకి తీసుకోవాలి
ప్రతి రోజు మాకు ఎజెండా 1:00 గంటకు వస్తుంది.. మొన్న మాత్రం 1:40 గంటలకు వచ్చింది.. అప్పుడు వస్తే సబ్జెక్ట్ మీద మేము ప్రిపేర్ ఎప్పడు కావాలి
25 ఏండ్ల నా అనుభవంలో ఇలా సభ జరగడం నేను ఎప్పడు… pic.twitter.com/myP1Xvw11e
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అసెంబ్లీలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదు.. సభకు తెలిపిన కేటీఆర్