మిల్లర్లు సొమ్ము మళ్లింపు కేసులో తీర్పు రిజర్వు
మిల్లింగ్ సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా దారిమళ్లించారంటూ రైస్ మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేయాలని కోరుతూ దాఖలైన సుమారు 300 పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ పూర్తిచేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): మిల్లింగ్ సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా దారిమళ్లించారంటూ రైస్ మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేయాలని కోరుతూ దాఖలైన సుమారు 300 పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ పూర్తిచేసింది. తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీనివాసరావు ప్రకటించారు.
తొలుత రైస్ మిల్లర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్ఎన్ మహేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, 202223లో మిల్లింగ్ నిమిత్తం పంపిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయవద్దని ప్రభుత్వమే చెప్పిందని, దీనివల్ల ప్రభుత్వానికి నష్టమేమీ జరుగలేదని చెప్పారు. కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని తెలిపారు. సొమ్మును వసూలు చేసుకోవడానికే క్రిమినల్ కేసులు పెట్టి ఒత్తి డి తీసుకొస్తున్నదని చెప్పారు.
పిటిషనర్లపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. రూల్స్ ప్రకారం ఒకో మిల్లుకు సీజన్‌కు 8 టన్నులను మాత్రమే మిల్లింగ్ కోసం తరలించాల్సి ఉండగా రెండు నుంచి 10 రెట్లు అధికంగా పౌరసరఫరాల కార్పొరేషన్ తరలిస్తున్నదని తెలిపారు.
కార్పొరేషన్ చేసిన తప్పునకు మిల్లర్లపై కేసు నమోదైందని మధ్యవర్తిత్వ విధానం ఉండగా నేరుగా క్రిమినల్ కేసు నమోదు చేయడం చెల్లదని అన్నారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లెనాగేశ్వర్రావు ప్రతివాదన చేస్తూ, ప్రభుత్వానికి ధాన్యం నిల్వలకు సమానమైన రూ.3,960 కోట్ల బకాయిలు చెల్లింపులు చేయలేదని చెప్పారు. ఈ మొత్తాన్ని మిల్ల ర్లు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. వాదనలు ముగియడం తో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

