నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 9 : విజయ్ దివస్‌ను సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ 11 రోజులపాటు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన రోజును పురస్కరించుకొని విజయ దివస్ నిర్వహించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాల వద్ద మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. యాదగిరిగుట్టలో కేసీఆర్ ఫ్లెక్సీకి గొంగిడి సునీతా క్షీరాభిషేకం చేశారు.