గీసుగొండ, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4వేల పింఛన్ హామీ సంగతేమో కానీ, పెండింగ్లో ఉన్న రూ.2వేల పింఛన్లు మంజూరు చేయాలని వితంతువులు వినూత్న రీతిలో నిరసన తెలిపా రు. మంగళవారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం మున్సిపల్ కార్యాలయం ఎదు ట సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వితంతువులు పాలాభిషేకం చే శారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సుంకరి మనీషాశివకుమార్ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో 1,500 మంది వితంతువులకు పింఛ న్లు ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.