Election Code | హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియమాలపై కేంద్రం ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులకు (లౌడ్ స్పీకర్లు) అనుమతి లేదని స్పష్టంచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.