మహబూబ్‌నగర్/సూర్యాపేట టౌన్, జూలై 16: సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ సెల్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు రాంకుమార్, శివతోపాటు పలువురు, పట్టణంలోని వేపూర్ గేరికి చెందిన మాజీ కౌన్సిలర్ గంజి యాదయ్య, సంతోష్‌కుమార్, లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేంద్ర, శరత్‌కుమార్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీ సంతోష్‌కుమార్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు దీటుగా మహబూబ్‌నగర్ అభివృద్ధిలో ఉన్నతస్థాయికి చేరుకొంటుందని పేర్కొన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం దాచక్పల్లికి చెందిన అనుపాటి లక్ష్మమ్మ, వడ్డె బాలమ్మ, దయ్యాలమర్రి తండాకు చెందిన తులసీబాయ్ కుటుంబాలకు రైతుబీమా ద్వారా మంజూరైన రూ.15 లక్షల (ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు) విలువగల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నేత గుర్రం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో చివ్వెంల మండలం గాయంవారిగూడెం, రోళ్లబండతండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ వార్డు మెంబర్లు, నాయకులు టీఆర్ఎస్లో చేరారు.