Satya Nadella | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉం డాలన్న తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం సోమవారం హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. నైపుణాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్-50 నగరాల్లో ఒకటిగా నిలుపుతాయని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తాము హైదరాబాద్‌లో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని, 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డాటా సెంటర్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌తోపాటు తెల ంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెంచుతున్న సత్య నాదెళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ డొమైన్లో హై దరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలపడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తున్నదని పేర్కొంటూ.. ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మం త్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.