హైదరాబాద్, నవంబర్3 (నమస్తే తెలంగాణ): టీఎస్ యూటీఎఫ్, గురుకుల సంఘాల జేఏసీ చేపట్టిన పో రాటాల ఫలితంగానే ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యార్థుల మెస్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందని టీఎస్ యూటీఎఫ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లయ్య వెల్లడించారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
మెస్చార్జీలను పెంచకపోవడంతోనే విద్యార్థులకు పౌ ష్టికాహారం అందడం లేదని భావించి, ఉపాధ్యాయుల సామాజిక బాధ్యత గా సెప్టెంబర్ 28న మహాధర్నా నిర్వహించామని తెలిపారు. దీంతో ప్రభు త్వం మెస్, కాస్మెటిక్ చార్జీలను పెం చిందని వివరించారు. గురుకులాల్లో ని ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.