వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి మండల విశ్వ బ్రాహ్మణ సంఘంనూతన కమిటీ బాధ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులను మంత్రి అభినందించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వ వైభవం తెస్తున్నారని అన్నారు. నూతన కమిటీ సంఘం సభ్యులతో పాటు, వినియోగదారుల శ్రేయోభిలాషిగా వ్యవహరించాలని సూచించారు.
మంత్రిని కలిసిన వారిలో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి, ప్రధాన కార్యదర్శి కందుకూరి రాజేంద్రాచారి, ఉపాధ్యక్షులు ఉపేంద్రచారి, రమేష్ చారి, కమిటీ సభ్యులు ఉన్నారు.