గంభీరావుపేట, అక్టోబర్ 12: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంట్యాల గ్రామ యాదవ సంఘం సభ్యులు మంత్రి కేటీఆర్‌కు మద్దతు తెలిపారు. గురువారం వారు గోరంట్యాలలో సమావేశమై, అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌కు మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు.
కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం వారు జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయకు తీర్మానపత్రం అందజేశారు.