హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీకి మేఘా కంపెనీ రూ.200 కోట్ల విరాళాన్ని అందజేసింది. శనివారం సీఎం సమక్షంలో వీసీ సుబ్బారావుకు చెక్కను ఇచ్చింది. ఈ నిధులతో భవన నిర్మా ణం, మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందులో సహకారమందించేందుకు మేఘా ఎండీ కృష్ణారెడ్డి ఎంవోయూ చేసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.