హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): హానికరమైన రసాయనమైన ‘పిక్రామిక్ యాసిడ్’ను కలుపుతూ మెహందీ తయారు చేస్తున్న ముఠాను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ మెహదీపట్నంలోని షకీల్ ఇండస్ట్రీస్‌లో ఈ మెహందీ కోన్లు తయారు చేసి ‘స్పెషల్ కరాచీ మెహందీ కోన్’ పేరుతో మార్కెట్లోకి అమ్ముతున్నట్టు డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. కంపెనీని సీజ్ చేసినట్టు తెలిపారు.