హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్‌కుమార్ ప్రకృతి ప్రేమికుడు అని, గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా మొక్కలను నాటిస్తూ నిరంత రం పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి ఎనలేదని సినీహీరో రాంచరణ్‌తేజ్ ప్రశంసలు కురిపించారు. ‘సంతోష్‌కుమార్ కృషికి హ్యాట్సాఫ్’ అని పేర్కొన్నారు. ఎంపీ సంతోష్ స్వయంగా తీసి న ఛాయాచిత్రాలతో రూపొందించిన ‘వింగ్స్ ఆఫ్ ప్యాషన్’ పుస్తకాన్ని తన నివాసంలో శనివారం రాంచరణ్ ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్దం గా ఉండాలి’ అని బుక్‌లో సంతోష్‌కుమార్ చెప్పిన మాట తన హృదయాన్ని హత్తుకున్నదని చెప్పారు.
జీవులపట్ల కరుణ, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సహవాసం ఉంటే తప్ప అద్భుతమైన ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేమని, పక్షులు, మూగజీవాలను అర్థం చేసుకొనేందుకు సంతోష్ ఎంత శ్రమించారో చెప్పడానికి ఆ ఒక మాట సరిపోతుందన్నారు. దేశంలో ఎందరో ఫొటోగ్రాఫర్లు ఉండొ చ్చు కానీ రాజకీయ రంగం నుంచి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా ఫొటోలు తీసి వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుషా సంతోష్‌కుమార్ ఒకరే కావచ్చని ప్రశంసించారు. కళ, కళ కోసం కాదు.. ప్రజల కోసం అని పెద్దలు అన్న రీతిలో సంతోష్ తన ఫొటోల ద్వారా పక్షులు, జంతువులు, వాటి ఆవాసాలు, వాటి జీవవైవిధ్యాన్ని ఆవిషరిస్తూ.. తన కళ ను ప్రదర్శిస్తూ.. పక్షులు, మూగజీవాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారని కొనియాడారు.
చిరకాల కోరిక నెరవేరింది: సంతోష్
‘కాఫీ టేబుల్ బుక్ వింగ్స్ ఆఫ్ ప్యాషన్‌ను ఆవిష్కరించడంతో నా చిరకాల కోరిక నెరవేరింది’ అని ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. తన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీనుంచి కొన్ని స్నాప్షాట్స్ను పంచుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. పుస్తకాన్ని తీర్చిదిద్దేంకు కృషిచేసిన కిశోర్‌రావు, అనంతు చింతలపల్లి, మహి బెజవాడకు ధన్యవాదాలు తెలిపారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సినీహీరో రాంచరణ్తేజ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.