హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావుతో వివిధ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు శనివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం నెలకొన్నది. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ఈసందర్భంగా కేసీఆర్ ఆ నేతలతో చర్చించారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓడిన రాకేశ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. త్వరలో పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగతంగా బలోపేతం చేసుకునే అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది.